Man: ఈ రోజుల్లో ఇలాంటి భర్త ఉన్నాడంటే... నిజంగా నమ్మలేరు!

 Karnataka man has been made wax statue of wife who died in an accident
  • రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయిన వ్యక్తి
  • భార్య రూపురేఖలో మైనపు బొమ్మ తయారీ
  • బొమ్మతో కలిసి గృహప్రవేశం
కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి కొన్నాళ్ల కిందట తన భార్యను కోల్పోయారు. అయితే, భార్యను మర్చిపోలేని ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టారు. తన భార్య రూపురేఖలతో ఓ మైనపు బొమ్మ తయారుచేయించారు. ఇటీవల గృహప్రవేశం సందర్భంగా ఆ విగ్రహాన్ని ప్రదర్శించారు. గృహప్రవేశం వేడుకలో భార్య కూడా తన పక్కనే ఉందన్న భావనతో ఆయన ఎంతో సంతోషానికి లోనయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా కుటుంబ సభ్యులు ఆ మైనపు బొమ్మతో ఫొటోలు దిగి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గుప్తా భార్య కొన్నాళ్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. భార్యతో ఎంతో అనుబంధం ఉన్న ఆయన చాలా రోజుల పాటు కోలుకోలేకపోయారు. అయితే, మైనపు విగ్రహం చేయించిన తర్వాత భార్యను అందులో చూసుకుంటూ మునుపటిలా ఉత్సాహంగా ఉంటున్నారట.

Man
Wife
Wax Statue
Karnataka

More Telugu News