Vijayawada: ‘స్వర్ణ ప్యాలెస్’ అగ్నిప్రమాద ఘటన.. ముగ్గురి అరెస్ట్

3 arrest in Swarna palace fire accident case

  • ఆసుపత్రి జీఎం, చీఫ్ ఆపరేటర్, నైట్ షిఫ్ట్ ఆపరేటర్ల అరెస్ట్
  • స్వర్ణ ప్యాలెస్‌తో రమేశ్ ఆసుపత్రి చేసుకున్న ఒప్పంద పత్రాలు స్వాధీనం
  • ముమ్మర దర్యాప్తు చేస్తున్న మూడు బృందాలు

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనకు సంబంధించి పోలీసులు నిన్న సాయంత్రం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆసుపత్రి జనరల్ మేనేజర్ సుదర్శన్, చీఫ్ ఆపరేటర్ రాజగోపాల్ రావు, నైట్ షిఫ్ట్ మేనేజర్ వెంకటేశ్ ఉన్నారు. అలాగే, స్వర్ణ ప్యాలెస్‌తో రమేశ్ ఆసుపత్రి చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ కలెక్టర్ శివశంకర్ కమిటీ సభ్యులు నిన్న ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ.. ప్రమాదంపై ఓ అంచనాకు వచ్చామని, మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. కాగా, స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం నియమించిన మరో రెండు కమిటీలు కూడా చురుగ్గా దర్యాప్తు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News