Chandrababu: ఒంగోలు ఆసుపత్రిలో రెండు రోజులుగా మృతదేహం పడి ఉంది.. కుక్కలు పీక్కుతింటున్నాయి: వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు

Chandrababu posts a video of  a dead body lying down for 2 days
  • నేలపై మృతదేహాన్ని పడేసిన సిబ్బంది
  • ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్న చంద్రబాబు
  • మానవతా విలువలకు తూట్లు పొడుస్తున్నారని వ్యాఖ్య
ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మృతదేహం రెండు రోజులుగా పడి ఉన్న వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీన్ని చూస్తుంటే హృదయం బద్దలవుతోందని అన్నారు. సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని... రెండు రోజులుగా నేలపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. శవాన్ని కుక్కులు పీక్కుతుంటున్నాయని తెలిపారు. మానవతా విలువలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని... ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. ఈ ఘటనను ఖండించడానికి కూడా మాటలు రావడం లేదని అన్నారు.
Chandrababu
Ongole
GGH
Dead Body

More Telugu News