TikTok: టిక్ టాక్ ను మరిపిస్తాం: హైదరాబాద్ యాప్ 'హై స్టార్'

Made In Hyderabad App for Replacing Tiktok

  • టిక్ టాక్ మార్కెట్ వాటా కోసం పోటీలో పలు కంపెనీలు
  • మేడిన్ హైదరాబాద్ యాప్ గా వచ్చిన హై స్టార్
  • 60 సెకన్ల వీడియోలు అప్ లోడ్ చేసుకునే సదుపాయం

గత నెలలో నిషేధానికి గురైన ఫేమస్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ మార్కెట్ వాటాను పొందేందుకు పలు కంపెనీలు, స్టార్టప్ లు వినూత్నమైన యాప్స్ ను తయారు చేసి, అందుబాటులోకి తెస్తున్న వేళ, మేడిన్ హైదరాబాద్ యాప్ గా వచ్చిన 'హై స్టార్' దూసుకెళుతోంది.

ఈ యాప్ టిక్ టాక్ ను మరిపిస్తుందని నగరానికి చెందిన పబ్బాస్ గ్రూప్ నమ్మకంగా చెబుతోంది. టిక్ టాక్ లో కేవలం 15 సెకన్ల నిడివి వున్న యాప్స్ మాత్రమే అప్ లోడ్ చేసే అవకాశం ఉండగా, తమ యాప్ లో 60 సెకన్ల వీడియోలను అప్ లోడ్ చేయవచ్చని సంస్థ సీఈఓ స్వామి వెల్లడించారు.

కస్టమర్లు తమకు నచ్చిన అంశాల్లో వీడియోలను చేసి ఇతరులకు చూపించవచ్చని అన్నారు. డైలాగ్స్, కామెడీ, ఫుడ్, స్పోర్ట్స్, గేమింగ్, మీమ్స్ తదితర ఎన్నో మాధ్యమాలను ఎంచుకోవచ్చని అన్నారు. తమ యాప్ లో పేరు తెచ్చుకున్న వారికి వివిధ కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో సైతం అవకాశాలను కల్పిస్తున్నామని, తద్వారా వారికి సంపాదన కూడా ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News