Manyata Dutt: మేం ఇంతకుముందు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, ఇదీ అంతే: సంజయ్ దత్ కు క్యాన్సర్ పై భార్య స్పందన

Manyata Dutt messaged to fans on Sanjay Dutt illness
  • సంజూ ఓ పోరాటయోధుడున్న భార్య మాన్యత
  • అభిమానుల మద్దతు, ప్రేమ తమపై ఉండాలని ఆకాంక్ష
  • సానుకూల దృక్పథాన్ని వ్యాపింపచేద్దాం అంటూ పిలుపు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రమాదకర లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడి కావడం పట్ల భార్య మాన్యత స్పందించారు. సంజయ్ దత్ కోసం ప్రార్థనలు చేస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ప్రత్యేక సందేశం వెలువరించారు. సంజూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సందేశంలో పేర్కొన్నారు.

"ఈ దశను అధిగమించడానికి మాకు మరింత బలం, ప్రార్థనలు అవసరం. గతంలో మా కుటుంబం అనేక ఆటుపోట్లు చవిచూసింది. ప్రతిసారి నిలదొక్కుకున్నాం. ఇప్పుడు కూడా ఈ కష్టాన్ని అధిగమిస్తామన్న నమ్మకం ఉంది. ఈ సమయంలో సంజూ అభిమానులందరికీ చెప్పేదొక్కటే... దయచేసి పుకార్లను నమ్మకండి, ఆధారాల్లేని ఊహాగానాలపై ఆధారపడకండి. కానీ ఎప్పట్లాగానే మీ అపారమైన ప్రేమాభిమానాలను మాపై చూపండి. మీ విశేషమైన మద్దతును మాకు అందించండి.

సంజూ ఎప్పుడూ ఓ పోరాట యోధుడు. అందుకే దేవుడు మరోసారి మమ్మల్ని పరీక్షించాలని భావించాడు. మాకు కావాల్సిందల్లా మీ ఆశీస్సులు, మీ ప్రార్థనల బలమే. తప్పకుండా ఈ పరిస్థితులను జయిస్తామని తెలుసు. ఈ సందర్భాన్ని మనం సానుకూల దృక్పథాన్ని, ఆశావహ ధోరణిని వ్యాప్తి చేసేందుకు ఉపయోగించుకుందాం" అంటూ పిలుపునిచ్చారు.
Manyata Dutt
Sanjay Dutt
Cancer
Fans

More Telugu News