Russel Viper: భారత్ లో అరుదైన రెండు తలల రక్తపింజరి గుర్తింపు... వీడియో ఇదిగో!
- మహారాష్ట్రలో అరుదైన పామును చూసిన స్థానికుడు
- పామును పట్టుకున్న అటవీశాఖ అధికారులు
- పరిశోధనల నిమిత్తం సంరక్షణ కేంద్రానికి తరలింపు
గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న భారత్ లో అత్యధిక సంఖ్యలో మరణాలు కలుగజేసే విషసర్పాల్లో రక్తపింజరి ఒకటి. దీనికాటు అత్యంత ప్రాణాంతకం. అయితే, ఎంతో అరుదైన రీతిలో ఓ రక్తపింజరి రెండు తలలతో ఉండడాన్ని గుర్తించారు. మహారాష్ట్రలోని కల్యాణ్ జిల్లాలో డింపుల్ షా అనే వ్యక్తి ఈ పామును చూసి అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు ప్రేమ్ అహెర్ అనే పాముల పట్టే నిపుణుడితో కలిసి ఈ రెండు తలల పింజరిని పట్టుకున్నారు. ఈ పామును సరీసృపాల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ పామును పరిశోధనల కోసం వినియోగించడం జరుగుతుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.