Earthquake: భూకంపాల రాకను మీ ఫోన్లు ముందే చెప్పేస్తాయి... కొత్త ఫీచర్ కు గూగుల్ సన్నాహాలు

Google works on a new feature to warn users about earthquakes
  • ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై ఎర్త్ క్వేక్ ఫీచర్ కు రూపకల్పన
  • ఫోన్లలో చిన్న యాక్సెలరో మీటర్లు
  • బ్లాగులో వెల్లడించిన ఆండ్రాయిడ్ ఇంజినీర్
తుపానుల రాకడను ముందే పసిగట్టే వీలుంది కానీ, భూకంపాల తాకిడిపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, గూగుల్ ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఎర్త్ క్వేక్ అలర్ట్స్ ఫీచర్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ భూకంపాలను ముందే పసిగట్టి యూజర్లను అప్రమత్తం చేస్తుంది.

గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ లో ప్రధాన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న మార్క్ స్టోగైటిస్ దీనిపై బ్లాగులో వివరాలు తెలిపారు. సమయానుకూలంగా, ఉపయుక్తంగా ఉండేలా ప్రజలకు భూకంపాలపై సమాచారం అందించే దిశగా గూగుల్ ప్రయత్నిస్తోందని తెలిపారు. తాము రూపొందిస్తున్న ఫీచర్ కొన్ని క్షణాలపాటు యూజర్లను అప్రమత్తం చేస్తుందని వివరించారు.

ఫోన్లలో ఉండే యాక్సెలరో మీటర్ భూకంప తరంగాలను గుర్తించి ప్రమాద తీవ్రతను అంచనా వేస్తుందని, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ఎర్త్ క్వేక్ ఫీచర్ ద్వారా ఆ సమాచారం యూజర్ కు తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఫీచర్ తో కూడిన కోట్లాది ఆండ్రాయిడ్ ఫోన్లు ఓ నెట్వర్క్ గా అనుసంధానమైతే, భూకంపాలను గుర్తించే చిన్న సీస్మోమీటర్లుగా మారిపోతాయని గూగుల్ పేర్కొంటోంది.
Earthquake
Feature
Google
Android

More Telugu News