Chiranjeevi: సంజయ్ భాయ్... నువ్విలాంటి పరిస్థితులతో పోరాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది: చిరంజీవి

Chiranjeevi responds to Sanjay Dutt illness
  • క్యాన్సర్ బారినపడిన సంజయ్ దత్
  • చిరంజీవి ఓదార్పు వచనాలు
  • త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో ఓదార్పు వచనాలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి కూడా సంజయ్ దత్ పరిస్థితి పట్ల చలించిపోయారు.

"అత్యంత ప్రియమైన సంజయ్ భాయ్... నువ్వింతటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నావని తెలిసి ఎంతో బాధగా ఉంది. కానీ నువ్వో ఫైటర్ వి. ఎన్నో ఏళ్లుగా అనేక సంక్షోభాలను అధిగమించావు. ఎలాంటి సందేహం లేదు, దీన్నుంచి కూడా నువ్వు తప్పకుండా బయటికి వస్తావు. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రేమతో ప్రార్థిస్తున్నాం" అంటూ ట్వీట్ చేశారు. గతంలో సంజయ్ దత్ హిందీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమా చేయగా, చిరంజీవి ఆ సినిమాను తెలుగులోకి శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా సీక్వెల్ ను కూడా చిరు తెలుగులో చేశారు.
Chiranjeevi
Sanjay Dutt
Cancer

More Telugu News