Helmets: ఇక హెల్మెట్ లకు 'బీఐఎస్' లేకుంటే భారీ జరిమానా!

Center Orders on Helmets
  • కరోనా నేపథ్యంలో ఫేస్ షీల్డ్ తో ప్రయాణాలు
  • ఫేస్ షీల్డ్ కాపాడలేదన్న కేంద్రం
  • నాణ్యమైన హెల్మెట్లు వాడకుంటే కఠిన చర్యలు
బైక్ లపై ప్రయాణించే సమయంలో ఏదో ఒక హెల్మెట్ ఉంటే సరిపోతుందిలే అనుకుంటే ఇక కుదరదు. హెల్మెట్ కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్క్ లేకుంటే భారీ జరిమానా పడుతుంది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్లాయి.

 కరోనా కారణంగా కేవలం ఫేస్ షీల్డ్ ను ధరించి వాహనదారులు ప్రయాణాలు సాగిస్తుండగా, ఏదైనా అనుకోని ఘటన జరిగితే, ఫేస్ షీల్డ్ తలకు భద్రతను కల్పించలేదని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. వాహనదారులంతా విధిగా, నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే ధరించేలా చూడాలని తన ఆదేశాల్లో కేంద్రం పేర్కొంది.
Helmets
ISB
Fine

More Telugu News