Rhea Chakraborthy: సుశాంత్ కేసులో కొత్త లింకులు.. రియా కాల్ లిస్టులో రానా, రకుల్ పేర్లు!

Rana and Rakul Preet  Singh names in Rhea Chakraborthys call list
  • రియా చక్రవర్తిని విచారిస్తున్న ఈడీ
  • కాల్ డేటాలో పలువురు ప్రముఖుల పేర్లు
  • రియాకు, అమీర్ ఖాన్ కు మధ్య సంభాషణ
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈడీ విచారణలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పలు విషయాలను వెల్లడించింది. మరోపక్క, రియాకు సంబంధం ఉన్నవారి వివరాలను ఈడీ సేకరిస్తోంది. ఇంతవరకు సుశాంత్ మరణంపై ఖాన్ త్రయం అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు నోరు మెదపని సంగతి తెలిసిందే. అయితే రియా కాల్ డేటాలో అమీర్ ఖాన్ పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. అమీర్ కు రియా ఒకసారి ఫోన్ చేయగా... ఆయన నుంచి మూడు మెసేజ్ లు వచ్చాయి.

మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్  సింగ్ కు రియా 30 సార్లు ఫోన్ చేసింది. రియాకు రకుల్ 14 సార్లు కాల్ చేసింది. దగ్గుబాటి రానాకు కూడా రియా 7 సార్లు ఫోన్ చేయగా... ఆమెకు రానా 4 సార్లు ఫోన్ చేశాడు. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ కు, రియాకు మధ్య కూడా ఫోన్ సంభాషణలు నడిచాయి. మరోవైపు ఈ కేసులో పలు కోణాల్లో ముంబై పోలీసులు, బీహార్ పోలీసులు, సీబీఐ, ఈడీలు విచారిస్తున్న సంగతి తెలిసిందే.
Rhea Chakraborthy
Sushant Singh Rajput
Rana Daggubati
Rakul Preet Singh
Bollywood
Aamir Khan

More Telugu News