Kinjarapu Ram Mohan Naidu: మా బాబాయ్ గురించి నాకు బాగా తెలుసు... ఎన్నో సమస్యలను అధిగమించారు: రామ్మోహన్ నాయుడు

MP Ram Mohan Naidu comments on Atchannaidu corona testing result
  • అచ్చెన్నాయుడికి కరోనా
  • ఈఎస్ఐ కొనుగోళ్ల కేసులో అరెస్ట్
  • అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స
  • బాబాయ్ ఫైటర్ అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్
ఈఎస్ఐ కొనుగోళ్ల అవకతవకల కేసులో అరెస్టయి, అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు.

"అచ్చెన్నాయుడు బాబాయ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. మా బాబాయ్ గురించి నాకు బాగా తెలుసు. ఆయనొక పోరాట యోధుడు. ఎన్నో తీవ్ర సమస్యలను కూడా ఆయన అధిగమించారు. ఆయన ఈ కరోనా మహమ్మారిని కూడా జయిస్తారు, పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తారు. ఈ మూడు నెలలుగా మా వెన్నంటే ఉన్న శ్రేయోభిలాషులకు, మద్దతుదారులకు ధన్యవాదాలు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
Kinjarapu Ram Mohan Naidu
Atchannaidu
Corona Virus
Positive
ESI Scam
Andhra Pradesh

More Telugu News