Devineni Uma: గ్రాఫిక్స్ కాదు.. ఇది నిజమైన అమరావతి: వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమ
- ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా ప్రజా రాజధానిగా అమరావతి
- సీఆర్డీఏ చట్టం నిర్ణయం జరిగింది
- రైతుల కౌలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడంలేదు
- రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారమిచ్చారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి గ్రాఫిక్స్ కాదని, ఇది నిజమైన రాజధాని అంటూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. రైతులు త్యాగం చేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌలు ఇవ్వట్లేదని విమర్శించారు.
'ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా ప్రజా రాజధానిగా అమరావతి, సీఆర్డీఏ చట్టం నిర్ణయం జరిగింది. జీవో ఇచ్చి రెండు నెలలైనా 186 కోట్ల రైతుల కౌలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడంలేదు? రైతుల త్యాగంతో కూడిన భూమితో పాటు రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారం ఇచ్చారు వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు.