Amazon: ఆన్ లైన్ లో ఇక మందుల విక్రయం కూడా... అమెజాన్ సరికొత్త నిర్ణయం!

Amazon set to launch online pharmacy services in India

  • త్వరలో అమెజాన్ ఫార్మసీ
  • అన్ని రకాల మందుల విక్రయానికి అమెజాన్ సన్నాహాలు
  • మొదట బెంగళూరులో సేవలు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లాక్ డౌన్ పరిస్థితుల్లో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఔషధాలను కూడా ఆన్ లైన్ లో విక్రయించాలని భావిస్తోంది. అమెజాన్ ఫార్మసీ పేరిట అందించే ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. నోటి మాటతో అడిగి తీసుకునే మందులనే కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై మాత్రమే లభించే ఔషధాలను కూడా అమెజాన్ తన ఆన్ లైన్ దుకాణంలో విక్రయించనుంది. అంతేకాదు, సాధారణ స్థాయి వైద్య పరికరాలు, సంప్రదాయ భారత మూలికా ఔషధాలు కూడా అమెజాన్ ఫార్మసీలో లభించనున్నాయి.

భారత్ లో వాల్ మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్ కార్ట్, ముఖేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్, మరికొన్ని ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో అమెజాన్ తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. కాగా, అమెజాన్ ఫార్మసీ సేవలను తొలుత బెంగళూరులో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News