Entrance Tests: ఏపీలో వివిధ ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేశ్

Exam dates of common entrance tests announced by ap government
  • కరోనా ప్రభావంతో నిలిచిన సెట్ లు
  • తేదీలు ఖరారు చేసిన ఏపీ సర్కారు
  • సెప్టెంబరు 17 నుంచి 25 వరకు ఎంసెట్
అనేక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పలు ఎంట్రన్స్ టెస్టులకు ఏపీ సర్కారు తేదీలు నిర్ణయించింది. ఖరారు చేసిన తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రవేశ పరీక్షల నిర్వహణ సందేహాస్పదంగా మారింది. సెట్ లు జరుగుతాయా లేదా అన్న అయోమయం విద్యార్థుల్లో నెలకొంది. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్న ఏపీ సర్కారు దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది.

ఎంసెట్- సెప్టెంబరు 17 నుంచి 25 వరకు
ఐసెట్- సెప్టెంబరు 10, 11
ఈసెట్- సెప్టెంబరు 14
ఏపీ పీజీఈసెట్- సెప్టెంబరు 28, 29, 30
ఎడ్ సెట్- అక్టోబరు 1
లాసెట్- అక్టోబరు 1
ఏపీ పీఈ సీఈటీ- అక్టోబరు 2 నుంచి 5 వరకు
Entrance Tests
Andhra Pradesh
EAMCET
EDCET
Law CET
Adimulapu Suresh
Corona Virus

More Telugu News