Corona Virus: ఏపీలో కొనసాగుతున్న కరోనా బీభత్సం... 24 గంటల్లో 97 మంది మృతి
- కర్నూలు జిల్లాలో 12 మంది మృతి
- 2,475కి పెరిగిన మొత్తం మరణాల సంఖ్య
- తాజాగా 9,779 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 97 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 12 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, గుంటూరు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,475కి పెరిగింది.
అటు, కొత్త కేసుల సంఖ్య కూడా భారీగానే ఉంది. గత 24 గంటల్లో 8,943 మందికి కరోనా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,146 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,73,085కి చేరింది. తాజాగా 9,779 మంది డిశ్చార్జి కాగా, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,80,703గా నమోదైంది. ఇంకా 89,907 మంది చికిత్స పొందుతున్నారు.