Kim Jong Un: రెండు విపత్తులను ఒకేసారి ఎదుర్కొంటున్నాం: కిమ్ జాంగ్ ఉన్
- కరోనాతో పాటు వరదలను ఎదుర్కొంటున్నాం
- మనకు ఎవరి సహాయం అవసరం లేదు
- విపత్తులను మనమే ఎదుర్కొందాం
ఉత్తరకొరియా కొత్త ప్రీమియర్ నియామకాన్ని ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ చేపట్టారు. ప్రస్తుత ప్రీమియర్ గా ఉన్న కిమ్ జే ర్యోంగ్ స్థానంలో కిమ్ టోక్ హన్ ను నియమించారు. నిన్న నిర్వహించిన వర్కర్స్ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన ఈ నియామకాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ, ప్రస్తుతం మనం కరోనా వైరస్ తో పాటు, అనూహ్యంగా సంభవించిన వరదల రూపంలో రెండు విపత్తులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమకు ఎవరి సహాయం అవసరం లేదని.. విపత్తులను మనమే ఎదుర్కొందామని చెప్పారు. అయితే, గతంలో ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉన్నామని... రాజకీయాలను పక్కన పెట్టి, మానవతా దృక్పథంతో ఉత్తరకొరియాకు స్నేహ హస్తాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దక్షిణకొరియా ప్రకటించింది.