Corona Virus: తెలంగాణలో 90 వేలు దాటేసిన కరోనా కేసులు
- కొత్తగా 1,863 మందికి కరోనా
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,259
- ఆసుపత్రుల్లో 23,379 మందికి చికిత్స
- 66,196 మంది డిశ్చార్జ్
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,863 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు, 1912 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,259కు చేరింది. ఆసుపత్రుల్లో 23,379 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 66,196 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 684 కి చేరింది. జీహెచ్ఎంసీలో 394 మందికి కొత్తగా కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 131 కేసులు నమోదయ్యాయి.