Yanamala: ఇదేనా గ్రామ స్వరాజ్యం అంటే?: యనమల రామకృష్ణుడు విమర్శలు
- గ్రామ వాలంటీర్లుగా సొంత పార్టీ వాళ్లను నియమించారు
- కరోనా నిధులు రూ.8,000 కోట్లు మళ్లించారు
- 73, 74వ రాజ్యాంగ సవరణలు ఎందుకు అమలు చేయట్లేదు?
- 14 నెలల పాలనలో ప్రజల స్వేచ్ఛను హరించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామ స్వరాజ్యం తీసుకొస్తున్నామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని, అయితే గ్రామ వాలంటీర్లుగా సొంత పార్టీ వాళ్లను నియమించడం గ్రామ స్వరాజ్యమా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా నిధులు రూ.8,000 కోట్లు మళ్లించడం గ్రామ స్వరాజ్యమా? అని ఆయన నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 73, 74వ రాజ్యాంగ సవరణలు ఎందుకు అమలు చేయట్లేదు? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన దాంట్లో మూడో వంతు కూడా గ్రామీణాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆయన చెప్పారు.
14 నెలల పాలనలో ప్రజల స్వేచ్ఛను హరించారని యనమల రామకృష్ణుడు చెప్పారు. 600కు పైగా పోస్టులు సొంత సామాజిక వర్గానికే కేటాయించారని ఆయన చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ తమ వాళ్ల నియామకమే వైసీపీ చేస్తోన్న సామాజిక న్యాయమా? అని ఆయన నిలదీశారు.