Corona Virus: మనదేశంలో కరోనా వైరస్ 73 రకాలుగా మార్పు చెందిందా..?

Odisha scientists research on corona virus gene mutation

  • కరోనా వైరస్ లో రెండు జాతులు గుర్తింపు
  • భారత్ వాతావరణంలో అనేక ఉత్పరివర్తనాలకు లోనైందని వెల్లడి
  • కరోనా బలహీనత తెలిస్తే విరుగుడు సులభం అంటున్న పరిశోధకులు

అత్యంత ప్రమాదకర వైరస్ కరోనాపై ఒడిశా శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. భారతదేశ వాతావరణంలో ఉత్పరివర్తనాలకు లోనైన కరోనా మహమ్మారి 73 రకాలుగా మార్పు చెందిందని వారు గుర్తించారు. దాదాపు 1500కి పైగా కరోనా నమూనాలను పరీక్ష చేసిన ఒడిశా శాస్త్రవేత్తలు ఈ వైరస్ లో బి 1.112, బి 1.99 అనే రెండు జాతులు ఉన్నాయని కనుగొన్నారు.

ప్రధాన వైరస్ నుంచి అనేక రకాలుగా కరోనా ఉత్పరివర్తనాలు ఏర్పడ్డాయని, కరోనా బలహీనత గురించి పూర్తిగా తెలుసుకుంటే చికిత్స ఎంతో సులభతరం అవుతుందని, దానికి వ్యాక్సిన్ రూపొందించడం ఏమంత కష్టసాధ్యం కాబోదని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ జయశంకర్ దాస్ తెలిపారు. తమ అధ్యయనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్ లైన్ లో ఉంచామని ఆయన వెల్లడించారు.

ఒడిశా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం సీఎస్ఐఆర్, ఐజీఐబీ, న్యూఢిల్లీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భువనేశ్వర్ కు చెందిన ఎస్ యూఎం పరిశోధకులతో కలిసి పనిచేశారు.

  • Loading...

More Telugu News