Anthony Fauci: వ్యాక్సిన్ వస్తే ఒక్క ఏడాది చాలు... అంతా సర్దుకుంటుంది: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఫాసీ

Anthony Fauci responds on corona vaccine

  • అమెరికా వ్యాక్సిన్ వచ్చే ఏడాది వస్తుందన్న ఫాసీ
  • అంటువ్యాధులపై మానవుడి ఆధిపత్యం తక్కువేనని వెల్లడి
  • రష్యా వ్యాక్సిన్ పై మరికొంత పరిశీలన అవసరమని స్పష్టీకరణ

అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంనీ ఫాసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వస్తే ఒక్క ఏడాదిలో పరిస్థితి మారిపోతుందని, కరోనా కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులన్నీ సర్దుకుంటాయని అభిప్రాయపడ్డారు. అయితే నమ్మదగిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని, 2021 ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. మానవులు అంటువ్యాధులపై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించిన సందర్భాలు చాలా తక్కువ అని, గతంలో అమ్మవారు వ్యాధిపై మాత్రమే మానవులు పైచేయి సాధించారని, మిగతా వ్యాధులను మాత్రం అదుపులో ఉంచగలిగారని ఫాసీ వివరించారు.

ఇప్పుడు కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ రానట్టయితే దాని ప్రభావం మరికొన్నాళ్ల పాటు మానవాళిపై ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలోని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫాసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రష్యా వ్యాక్సిన్ పైనా స్పందించారు. రష్యా వ్యాక్సిన్ ను మరింత పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దాని సమర్థత నిరూపితమైన తర్వాతే ప్రజలకు అందించాలన్నారు.

  • Loading...

More Telugu News