Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్

Sirivennela son Raja Chembolu got Engaged
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేసిన రాజా
  • 2020లో కొత్త ప్రయాణం ఆనందంగా ఉందన్న నటుడు
  • కేరెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న రాజా
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు, నటుడు రాజా చెంబోలు నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిశ్చితార్థం అనంతరం కాబోయే భార్యతో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాజా షేర్ చేస్తూ.. 2020లో కొత్త ప్రయాణం ఆనందంగా ఉందని, మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలని పేర్కొన్నాడు. అయితే, పెళ్లి ఎప్పుడు? అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, రాజా కేరెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవడు, ఫిదా, రణరంగం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సినిమాలు రాజాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 
Sirivennela
Raja Chembolu
Tollywood
Engagement

More Telugu News