India: భార‌త్-నేపాల్‌ మ‌ధ్య చ‌ర్చ‌లు.. వివాదాలు రాజుకున్న నేపథ్యంలో ప్రాధాన్యత

india nepal meet

  • కొన్ని రోజులుగా భారత్‌ పట్ల నేపాల్ వ్యతిరేక ధోరణి 
  • భార‌త్ నిధుల‌తో  జ‌రుగుతున్న అభివృద్ధి పనుల‌పై చర్చ
  • వివాదాలు పరిష్కరించుకునే అవకాశం

చైనా ప్రోత్సాహంతో కొన్ని రోజులుగా భారత్‌పై నేపాల్ వ్యతిరేక ధోరణి కనబర్చుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చించేదుకు ఇరు దేశాల అధికారులు ఈ రోజు చర్చలు జరపనున్నారు. భార‌త అధికారి విన‌య్ మోహ‌న్ క్వాత్రా, నేపాల్ విదేశాంగ కార్య‌ద‌ర్శి శంక‌ర్ దాస్ బైరాగి ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొంటారు.

‌నేపాల్‌లో భార‌త్ నిధుల‌తో  జ‌రుగుతున్న అభివృద్ధి పనుల‌పై వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. సరిహద్దు వివాదంపై కూడా ఈ చర్చలు  ప‌రిష్కారం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. నేపాల్‌లో భారత్ సాయంతో కొనసాగుతోన్న ప్రాజెక్టుల‌పై ఈ స‌మీక్ష జ‌రుగుతున్నప్పటికీ .. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న వివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ద్వైపాక్షిక ప్రాజెక్టుల‌పై స‌మీక్ష నిర్వ‌హించే విధానాన్ని 2016లో ప్రారంభించారు. గత ఏడాది జూలైలో ఏడ‌వ స‌మావేశం జ‌రిగింది. రైళ్లు, రోడ్లు, బ్రిడ్జ్‌లు, బోర్డ‌ర్ చెక్ పోస్టులు, విద్యుత్తు వంటి అనేక అంశాలపై చర్చలు జరిగాయి.  

కాగా, కాలాపానీ, లిపులేక్‌, లింపియాదర త‌మ‌వేనంటూ నేపాల్  కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన నేపథ్యంలో జరుగుతోన్న ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News