KCR: కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు.. దుబాయ్ లో ఉన్న వ్యక్తి అరెస్ట్!

Man posted objectionable comments on KCR from Dubai arrested
  • దుబాయ్ లో ఉంటున్న పణ్యాల రాజు
  • జూన్ లోనే లుక్ అవుట్ నోటీసుల జారీ
  • ఎల్వోసీ ద్వారా ఇండియాకు రప్పించిన సీసీఎస్ పోలీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పణ్యాల రాజు అనే ఈ వ్యక్తి దుబాయ్ లో ఉంటున్నారు. అక్కడి నుంచే కేసీఆర్ పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. జూన్ నెలలోనే ఈయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈయనపై పోలీసులు 188, 469, 54, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఎల్వోసీ ద్వారా ఆయనను ఇండియాకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు.
KCR
TRS
Social Media
Comments
Arrest
Dubai

More Telugu News