Actress Madhavilatha: హిందువుల మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు.. నటి మాధవీలతపై కేసు నమోదు
- ఫేస్‌బుక్ ఖాతాలో వివాదాస్పద పోస్టు
- ఫిర్యాదు చేసిన వనస్థలిపురం విద్యార్థి
- సెక్షన్ 295-ఎ కింద కేసు నమోదు
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నటి తన ఫేస్‌బుక్ ఖాతాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టు పెట్టారన్న ఫిర్యాదుతో ఆమెపై సెక్షన్ 295-ఎ కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.