WWE: 'డబ్ల్యూడబ్ల్యూఈ' మహిళా రెజ్లర్‌పై వేధింపులు.. కిడ్నాప్‌కు యత్నం

Man arrested on multiple charges over alleged plot to kidnap WWE star Sonya Deville
  • గత కొన్ని రోజులుగా సోన్యను వేధిస్తున్న థామస్
  • ఆమె ఫ్లాట్ ఆవరణలోకి చొరబడి నాలుగు గంటలపాటు గమనించిన థామస్
  • ఆపై గ్లాస్ డోర్ గుండా లోపలికి ప్రవేశించిన నిందితుడు
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మహిళా రెజ్లర్ సోన్య డెవిల్లే‌ను వేధింపులకు గురిచేయడమే కాకుండా కిడ్నాప్‌నకు యత్నించిన సౌత్ కాలిఫోర్నియా కార్డ్స్ విల్లే‌కు చెందిన థామస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా ఆమెను వేధిస్తున్న థామస్, ఆదివారం సోన్య ఫ్లాట్ ఆవరణలోకి చొరబడ్డాడు. దాదాపు నాలుగు గంటలపాటు అక్కడే ఉండి లోపల ఏం జరుగుతోందో గమనించాడు. అనంతరం ఇంటి గ్లాస్ డోర్ ద్వారా లోపలికి ప్రవేశించాడు. దీంతో ఇంట్లోని అలారం ఒక్కసారిగా మోగడంతో థామస్ కంగారుపడ్డాడు. అదే సమయంలో అప్రమత్తమైన ఫ్లాట్ యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు థామస్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
WWE
kidnap
sonya Deville
America

More Telugu News