Budda Venkanna: మరి ఆ ఆధారాలు ఎక్కడ? మీ పత్రికలో ఎందుకు ప్రచురించలేదు?: 'ఫోన్ ట్యాపింగ్‌'పై బుద్ధా వెంకన్న

budda venkanna slams ysrcp

  • అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు
  • గతంలో చంద్రబాబు సర్కార్ ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడిందంటున్నారు
  • ఆధారాలతో పాటు నిరూపించాం అంటున్నారు
  • హోంమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'ఫోన్‌ ట్యాపింగ్' ఆరోపణలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. 'అవాస్తవాలను ప్రచారం చెయ్యడంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, హోంమంత్రి  సుచరిత గారు గోబెల్స్ ని మించిపోయారు. గతంలో చంద్రబాబు సర్కార్ ఇజ్రాయెల్ టెక్నాలజితో ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడిన్నట్టు ఆధారాలతో పాటు నిరూపించాం అంటున్నారు. మరి ఆ ఆధారాలు ఎక్కడ? మీ పత్రికలో ఎందుకు ప్రచురించలేదు?' అని ప్రశ్నించారు.  

'ఎన్నికల తరువాత ఇదే అంశంపై వైవి సుబ్బారెడ్డి గారు వేసిన కేసు కూడా వెనక్కి తీసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని బుద్ధా వెంకన్న అన్నారు.  

'ఎన్నికలకు ముందు  సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదే అంశంపై కోర్టులో కేసు వేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆధారాలు చూపించలేక చేతులెత్తేసి కేసు విత్ డ్రా చేసుకున్నారు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమైతే హోంమంత్రి గారు ఏడాదిన్నర లో ఏం చర్యలు తీసుకున్నట్టు? కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం కేసులు వేశారు' అని బుద్ధా వెంకన్న అన్నారు.

  • Loading...

More Telugu News