Sensex: వరుసగా రెండో రోజు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
- 478 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 138 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- ఈరోజు పుంజుకున్న బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. నిన్న నష్టాలను మూటగట్టుకున్న బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు ఈరోజు లాభాల్లో కొనసాగాయి. వీటితో పాటు ఆటో, రియాల్టీ, మెటల్ సూచీలు కూడా లాభాల్లో ట్రేడ్ కావడంతో మార్కెట్లు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 478 పాయింట్లు లాభపడి 38,528 పాయింట్లకు పెరిగింది. నిఫ్టీ 138 పాయింట్లు పుంజుకుని 11,385 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.34%), ఎల్ అండ్ టీ (3.01%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.54%), టాటా స్టీల్ (2.31%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.22%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.10%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.53%), బజాజ్ ఆటో (-0.48%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.45%), సన్ ఫార్మా (-0.42%).