Madhya Pradesh: ఒకే ఇంట్లో 19 మందికి కరోనా... అందరూ కోలుకోవడంతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో!

Dance of A Family After Corona Treatment Goes Viral

  • ఉమ్మడి కుటుంబంలో కరోనా
  • మధ్యప్రదేశ్ లోని కాంతి పట్టణంలో ఘటన
  • అందరికీ నెగటివ్ రావడంతో ఆనందం

ఓ ఉమ్మడి కుటుంబంలో ఒకరికి కరోనా వైరస్ సోకింది. అది తెలియకుండానే ఇంట్లో ఉంటున్న అందరికీ వ్యాపించింది. దాంతో ఆ ఇంట్లో వున్న మొత్తం 19 మందీ కరోనా బారిన పడ్డారు. ఇక ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని కాంతి పట్టణంలో జరిగింది. ఆ ఇంట్లోని అందరినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు అధికారులు.

ఆపై వారికి చికిత్స ప్రారంభం కాగా, అందరూ కోలుకున్నారు. డాక్టర్లు వచ్చి, ఎవరిలోనూ వైరస్ లేదని, అందరికీ నెగటివ్ వచ్చిందని, ఇక డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పారు. దీంతో వారిలో ఆనందం కట్టలు తెంచుకుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆసుపత్రిలోనే డ్యాన్స్ చేశారు. 'చిచోరే' చిత్రంలోని 'చింతా కర్ కే క్యా పాయేగా, నర్ నేసే హలే మర్ జాయేగా' అంటూ సాగే పాటకు వీరు చేసిన డ్యాన్స్ వైరల్ అయింది.

  • Loading...

More Telugu News