Pranab Mukherjee: మరింత క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం.. తాజా బులిటెన్‌లో ఆసుపత్రి వెల్లడి

pranab in serious condition

  • ఇటీవల ప్రణబ్‌కు సర్జరీ 
  • వెంటిలేటర్‌పైనే చికిత్స
  • ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌

తమ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం క్షిణిస్తోందని ఆర్మీ ఆసుపత్రి ప్రకటించింది. ఆయన మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు సర్జరీ చేసి, న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడు ఆయనకు కరోనా కూడా సోకింది.

ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ, గుండె పనితీరు వంటివి మాత్రం స్థిరంగానే ఉన్నట్లు నిన్న బులిటెన్‌లో తెలిపిన ఆసుపత్రి ఈ రోజు తాజా బులిటెన్ విడుదల చేసింది. ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు తెలిపింది. ఆయనను ఇప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.

ప్రత్యేక వైద్య బృందం ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. మరోవైపు, ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ చెప్పారు. వైద్యులు అందిస్తోన్న చికిత్స ఫలితంగా ప్రణబ్‌ కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతిఒక్కరూ ప్రార్థించాలని కోరారు.

  • Loading...

More Telugu News