Somireddy Chandra Mohan Reddy: కృష్ణా బోర్డు ఇచ్చిన ఈ ఆదేశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం డ్యాంలోకి వరద
- అయినా పోతిరెడ్డిపాడుకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు
- కేవలం మద్రాసుకు తాగునీటి కోసం తెలుగుగంగకు 9 టీఎంసీలా?
- దాంతో ఆపేయమని కృష్ణా బోర్డు ఆదేశాలివ్వడం ఏంటీ?
భారీ వర్షాలతో డ్యాంలు నిండుతున్నప్పటికీ పోతిరెడ్డిపాడుకు మాత్రం నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 'కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం డ్యాంలోకి వరద పోటెత్తుతున్నా, గేట్లెత్తేస్తున్నా పోతిరెడ్డిపాడుకు మాత్రం నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరం. కేవలం మద్రాసుకు తాగునీటి కోసం తెలుగుగంగకు 9 టీఎంసీలిచ్చి ఆపేయమని కృష్ణా బోర్డు ఆదేశాలివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది' అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.
'కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం, వెనుకబడిన రాయలసీమలో సాగు, తాగునీటి ఆవశ్యకతను వివరించడంలో విఫలమవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని నా అభిప్రాయం. వెంటనే పోతిరెడ్డిపాడుకు పూర్తి స్థాయిలో నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నా' అని సోమిరెడ్డి పేర్కొన్నారు.