Rhea Chakraborthy: రియా చక్రవర్తికి అంత స్థాయి లేదు: బీహార్ డీజీపీ

Rhea Chakraborthy dosnt have that status to comment on CM says Bihar DGP
  • సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రియా
  • బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం వెనుక నితీశ్ హస్తం ఉందని ఆరోపణ
  • ఒక సీఎం గురించి మాట్లాడే స్థాయి రియాకు లేదన్న డీజీపీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిపై బీహార్ డీజీపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో రియా దాఖలు చేసిన పిటిషన్ లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరును ప్రస్తావించడంపై ఆయన మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి రియాకు లేదని చెప్పారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని... అందుకే సుశాంత్ కేసులో రాద్ధాంతం చేస్తున్నారని తన పిటిషన్ లో రియా పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ కేసుపై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడాన్ని ప్రస్తావిస్తూ... దీని వెనుక బీహార్ సీఎం జోక్యం ఉందని ఆమె పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై బీహార్ డీజీపీ స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.
Rhea Chakraborthy
Sushant Singh Rajput
Bollywood
Bihar
DGP
Nitish Kumar

More Telugu News