Monkeys: కొంప ముంచిన కోతులు.. డబ్బు, నగలు ఎత్తుకెళ్లిన వైనం!

Monkeys ran away with cash and gold in Tamil Nadu
  • తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఘటన
  • గుడిసెలో నివసిస్తున్న వృద్ధురాలు
  • రూ. 25 వేలు, ఉంగరం, కమ్మలను ఎత్తుకెళ్లిన కోతులు
కోతులు చేసిన పనితో ఓ వృద్దురాలు తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యారు గ్రామంలో శారదాంబాల్ అనే 70 ఏళ్ల వృద్ధురాలు గుడిసెలో ఒంటరిగా నివసిస్తోంది. ఈ వయసులో కూడా ఆమె ఉపాధి హామీ పనులకు వెళ్తోంది. నిన్న ఇంటి ముందు ఆమె బట్టలు ఉతుకుతుండగా... అక్కడకు పదికి పైగా కోతులు వచ్చాయి. ఆమె గుడిసెలోకి చొరబడ్డాయి.

ఇంట్లో ఉన్న అరటి పండ్లు, ఓ డబ్బాలో దాచి ఉంచిన బంగారు ఉంగరం, కమ్మలతో పాటు రూ. 25 వేల నగదును పట్టుకుని పారిపోయాయి. దీన్ని గమనించిన శారదాంబాల్ వాటి వెంట పడింది అయితే, అవి వాటిని కింద పడేయకుండా ఎత్తుకుపోయాయి. గ్రామస్థులు వాటి కోసం వెతికినా ఇంకా దొరకలేదు. తాను దాచుకున్నవన్నీ కోతులు ఎత్తుకుపోవడంతో... ఆ వృద్ధురాలు ఎంతో ఆవేదనలో మునిగిపోయింది.
Monkeys
Gold
Cash
Tamil Nadu

More Telugu News