Sensex: బ్యాంకింగ్ స్టాకుల పతనం.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
- 394 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 96 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- ఈరోజు ఆద్యంతం నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో షేర్లు చతికిల పడటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉదయం నుంచి చివరి వరకు కూడా మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 394 పాయింట్లు కోల్పోయి 38,220కి పడిపోయింది. నిఫ్టీ 96 పాయింట్లు నష్టపోయి 11,312 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (6.71%), ఓఎన్జీసీ (3.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.51%), టాటా స్టీల్ (0.15%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.31%), యాక్సిస్ బ్యాంక్ (-1.99%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.98%), భారతి ఎయిర్ టెల్ (-1.85%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.81%).