Haryana: హోం క్వారంటైన్‌లోకి హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్
- కరోనా బారినపడిన కేంద్రమంత్రితో సమావేశం
- కరోనా లక్షణాలున్న వారిని కలిసిన సీఎం
- ఫలితాల్లో నెగటివ్ వచ్చినా మూడు రోజులపాటు క్వారంటైన్‌లోకి
కరోనా లక్షణాలున్న పలువురిని కలవడంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా బారినపడిన కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను సీఎం ఈ నెల 19న కలిసి సమావేశంలో పాల్గొన్నారు. అలాగే, కరోనా లక్షణాలున్న పలువురిని కలిశారు. దీంతో అప్రమత్తమైన సీఎం.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు మనోహర్‌లాల్ ప్రకటించారు. మరోవైపు, షెకావత్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.