KCR: శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంలో మహిళ మృతదేహం లభ్యం.. కేసీఆర్ తీవ్ర ఆవేదన!

Women dead body found in Srisailam Power house fire accident

  • శ్రీశైలం ప్రమాదంలో ఆరు మృతదేహాలు లభ్యం
  • నలుగురి మృతదేహాలు గుర్తింపు
  • మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపిన కేసీఆర్

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. లోపల చిక్కుకున్న 9 మంది ఉద్యోగులు సురక్షితంగా బయటకు వస్తారని భావించినా... చివరకు విషాదకర వార్త బయటకు వచ్చింది. ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. రెస్క్యూ టీమ్ కు తొలుత అసిస్టెంట్ ఇంజినీర్ సుందర్ నాయక్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత మరో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం మరింత ఆవేదనకు గురి చేస్తోంది.

వీరిలో ముగ్గురుని ఫాతిమా, సుందర్, మోహన్ కుమార్ గా గుర్తించారు. మరో రెండు మృతదేహాలు ఎవరివో గుర్తించాల్సి ఉంది. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News