Janvy Kapoor: జాన్వీ కపూర్ కి విపరీతమైన ట్రోలింగ్.. అప్సెట్ అయిన భామ!

Janvy upset with trolling on social media
  • జాన్వీ నటించిన తాజా చిత్రం 'గుంజన్ సక్సేనా'
  • ఆగస్టు 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
  • చిత్రంపై పలు విమర్శలు.. నెటిజన్ల ట్రోలింగ్
శ్రీదేవి తనయగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ చేసిన సినిమాల కన్నా ఎక్కువగానే ప్రచారం తెచ్చుకుంది. ఆమెకున్న ఫామిలీ నేపథ్యాన్ని బట్టి మీడియాలో ఎక్కువగానే పబ్లిసిటీ వస్తుంటుంది. ఇక ఆమె తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం 'గుంజన్ సక్సేనా' ఈ నెల 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ గా రూపొందించిన ఈ చిత్రానికి విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది.

అయితే, చిత్రం ఆన్ లైన్లో విడుదలైన తర్వాత సినిమాలో అంత విషయం లేదంటూ రివ్యూలు, కామెంట్లు వచ్చాయి. అసలు అటువంటి పాత్ర పోషించే స్టేచర్ కానీ, మెచ్యూరిటీ కానీ జాన్వీలో లేవంటూ కూడా విమర్శలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో జాన్వీ బాగా అప్సెట్ అయిందట.  

దీనిపై జాన్వీ తాజాగా స్పందిస్తూ, గుంజన్ సక్సేనా సినిమాపై వచ్చిన ప్రతి రివ్యూనీ, ప్రతి ట్రోల్ నీ చూశానని చెప్పింది. ఆ ట్రోలింగ్ తనని చాలా బాధ పెట్టిందని పేర్కొంది. అంతేకాదు, ఈ సినిమాకు వచ్చిన క్రిటిసిజంపై తన తండ్రి కూడా బాగా ఫీలయ్యారని చెప్పింది. 'ఆయన నా సినిమా ముందే చూశారు. నా పెర్ఫార్మెన్స్ పట్ల ఆయనకు నమ్మకం వుంది. అందుకే అంతగా ఆయన పట్టించుకోలేదు' అని చెప్పింది జాన్వీ.    
Janvy Kapoor
Gunjan Saksena
Sridevi
Social Media

More Telugu News