Social Media: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టనున్న గంగవ్వ.. ఇప్పుడిదే హాట్ టాపిక్!

Youtube star Gangavva to be participate in BiggBoss 4
  • ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానల్ ద్వారా పేరు
  • పలు సినిమాల్లోనూ నటన
  • సోషల్ మీడియాలో హాట్ టాపిక్
‘మై విలేజ్ షో’ చానల్ ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు చిరపరిచితమైన గంగవ్వకు ‘బిగ్‌బాస్’ నుంచి పిలుపు వచ్చిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలంగాణ యాసతో ఫుల్ కామెడీ పండించే గంగవ్వకు ఉన్న పాప్యులారిటీ అంతా ఇంతా కాదు. అలా సంపాదించిన పేరుతో ఆమె కొన్ని సినిమాల్లోనూ నటించింది. సినీ స్టార్స్ సమంత, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్ వంటి వారితో ముచ్చటించింది కూడా.

 బోల్డంత ఫేమ్ సంపాదించుకున్న గంగవ్వకు ఇప్పుడు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, ఈ వార్తపై ‘బిగ్‌బాస్’ నుంచి కానీ, గంగవ్వ నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేదు. గత మూడు సీజన్‌లలో ఇంత వయసున్న వారిని బిగ్‌బాస్‌కు ఎంపిక చేయలేదని, గంగవ్వే తొలి వ్యక్తి కాబోతోందని ప్రచారం జరుగుతోంది.
Social Media
Bigg Boss Telugu 4
Gangavva

More Telugu News