USA: కరోనాను నాశనం చేసే ఆయింట్‌మెంట్‌ ను కనుగొన్న పరిశోధకులు

us develops corona ointment

  • ఏపీటీ టీ3ఎక్స్ ఆయింట్‌మెంట్ ను అభివృద్ధి చేసిన అమెరికా
  • యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం
  • ముక్కు ద్వారా సంక్రమించే కరోనానుంచి విముక్తి
  • 30 సెకన్లకే వైరస్ అంతం

ఓపక్క కరోనా వైరస్‌కు టీకాను కనుగొనే విషయంలోనూ.. మరోపక్క చికిత్సకు సమర్థవంతంగా పనిచేసే ఔషధాల ఆవిష్కరణకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను నిర్మూలించే ఏపీటీ టీ3ఎక్స్ అనే ఓ ఆయింట్‌మెంట్‌ను అమెరికా పరిశోధకులు కనిపెట్టగా, దాన్ని యూఎస్‌ఎఫ్‌డీయే ఆమోదించింది.

ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు అభివృద్ధి చేసిన ఈ ఆయింట్‌మెంట్‌ను మందుల షాపులో కొనుక్కునేందుకు ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదని, దీన్ని ఎవరైనా వాడుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ఆయింట్‌మెంట్‌తో చికిత్స చేసిన 30 సెకన్ల అనంతరం వైరస్‌ కనిపించలేదని ప్రయోగశాల నివేదికల ద్వారా తెలిసిందని అడ్వాన్స్‌డ్‌ పెనెట్రేషన్‌ టెక్నాలజీ సంస్థ  సీఈవో డాక్టర్‌ బ్రియాన్‌ హ్యూబర్ వెల్లడించారు.

ఈ ఆయింట్‌మెంట్ ఓ మంచి ఆవిష్కరణ అని, కరోనా నుంచి ఇటువంటి రక్షణ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఈ ఆయింట్‌మెంట్ ముందు వరుసలో నిలుస్తుందని ఆయన చెప్పారు. కాగా, ఈ ఆయింట్‌మెంట్ కరోనా వైరస్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై, బ్యాక్టీరియా, ఫంగస్‌లపై కూడా పని చేస్తోందని పరిశోధకులు తెలిపారు. ఈ ఆయింట్‌మెంట్‌ను వాడిన కొన్ని క్షణాలలోనే అది కరోనా విస్తరించే శక్తిని నాశనం చేస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News