Vietnam: వివాదాస్పద దీవుల్లో యుద్ధ విమానాలు మోహరించిన చైనా... భారత్ కు సమాచారం అందించిన వియత్నాం

Vietnam informs India about China deployment in Paracel Islands

  • పారాసెల్ దీవుల్లో చైనా కార్యకలాపాలు
  • విదేశాంగ కార్యదర్శిని కలిసిన వియత్నాం రాయబారి
  • వియత్నాంకు మద్దతుగా నిలుస్తున్న భారత్

ఇప్పటికే భారత్, చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం ఏర్పడింది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద పారాసెల్ దీవుల్లో చైనా ఓ ఫైటర్ జెట్ ను, మరో బాంబర్ ను మోహరించింది. ఈ మేరకు వియత్నాం దౌత్య వర్గాలు భారత్ కు  సమాచారం అందించాయి. దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితులు క్షీణిస్తున్నాయంటూ భారత్ లో వియత్నాం రాయబారి ఫామ్ సాన్ చౌ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లాకు వివరించారు. ఢిల్లీలో వీరిద్దరి మధ్య భేటీ జరిగింది.

దక్షిణ చైనా సముద్రంలో ఉన్న అనేక దీవులపై కన్నేసిన చైనా తరచుగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ పొరుగునున్న దేశాల సార్వభౌమత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తోంది. తాజాగా ఊడీ ఐలాండ్ లో హెచ్-6జే బాంబర్ తో పాటు మరో ఫైటర్ జెట్ విమానాన్ని కూడా చైనా మోహరించడంతో వియత్నాం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ అంశంలో వియత్నాంకు భారత్ దన్నుగా నిలుస్తోంది. సముద్ర జలాల్లో గస్తీ తిరిగేందుకు అనువైన బోట్ల కోసం 100 మిలియన్ డాలర్ల సాయం చేసింది.

  • Loading...

More Telugu News