Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవి తమకు వద్దంటున్న రాహుల్, ప్రియాంక... తీవ్ర ఉత్కంఠ!

Rahul and Priyaanka Reluctent to Accept President Post

  • నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
  • సోనియా రాజీనామాను ఆమోదించే అవకాశం
  • కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ 
  • రాహులే కావాలంటున్న కాంగ్రెస్ సీఎంలు

ఉత్తరప్రదేశ్ వ్యవహారాలను పరిశీలిస్తున్న ఆయన సోదరి ప్రియాంకా గాంధీ, తదుపరి పార్టీ అధ్యక్ష బాధ్యతలను తమపై మోపవద్దని అంటున్నారట. నేడు పార్టీలో అత్యంత కీలకమైన వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుండగా, ఇప్పటికే అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేసి, మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె రాజీనామాను నేడు ఆమోదించనున్న సీడబ్ల్యూసీ, కొత్త అధ్యక్షుడిని నేడు ప్రకటిస్తారని సమాచారం.

అయితే, మరోమారు రాహుల్ కు బాధ్యతలు కట్టబెడతారని వార్తలు వస్తున్న వేళ, ఆయన ఈ పదవిని స్వీకరించేందుకు అనాసక్తితో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలి రాజస్థాన్ రాజకీయ సంక్షోభం తరువాత, సుమారు 20 మంది నేతలు, పార్టీలో మార్పులు అనివార్యమంటూ సోనియాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సోనియా తన పదవికి రాజీనామా చేయగా, అటువంటి నిర్ణయం ఇప్పుడే వద్దంటూ పంజాబ్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, భూపేశ్ భాగెల్ లు తాము ఆమెకే మద్దతిస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ విషయాన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదని, అధ్యక్ష పదవి మార్పునకు ఇది సరైన సమయం కూడా కాదని, ఇప్పుడు జరుగుతున్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ పార్టీని విచ్చిన్నం చేయాలని చేస్తున్న ప్రయత్నమేనని, ప్రజాస్వామ్య విలువలను కాలరాయాలని ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ మరోసారి ముందుకు వచ్చి, పార్టీ పగ్గాలను చేపడతారన్న నమ్మకం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఇండియాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ కదలాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News