China: చైనాలో అందుబాటులోకి కరోనా టీకాలు.. వినియోగంపై పరిమిత ఆంక్షలు!

China authorises emergency use of COVID vaccines developed by Chinese companies

  • గత నెల 22 నుంచే ప్రారంభమైన వినియోగం
  • టీకాలు వేయించుకున్న వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు

చైనాలో మొత్తానికి కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటి వినియోగంపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా విధించింది. కరోనా ముప్పు అత్యధికంగా ఉన్న వారికి మాత్రమే వీటిని వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. గత నెల 22 నుంచే వీటి వినియోగాన్ని ప్రారంభించినట్టు టీకా అభివృద్ధి బృందానికి నేతృత్వం వహిస్తున్న జెంగ్ జోంగ్‌వీ తెలిపారు.

 చైనా కంపెనీలు అభివృద్ధి చేసిన ఈ టీకాలు వేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. నిజానికి ఈ టీకాలు ఇప్పటికీ క్లినికల్ ప్రయోగ దశలోనే ఉన్నాయి. అయితే, అత్యవసర ప్రాతిపదికన ఉపయోగించేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతిస్తోంది. ఆహార మార్కెట్లు, ట్రాఫిక్ వ్యవస్థ, సేవారంగాల్లో పనిచేసే వారికి తొలి ప్రాధాన్యంగా వీటిని ఇస్తున్నట్టు జోంగ్‌వీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News