Sensex: లాక్ డౌన్ తర్వాత తెరుచుకుంటున్న పరిశ్రమలు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
- 364 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 95 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- మూడున్నర శాతం వరకు పెరిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. లాక్ డౌన్ తర్వాత పరిశ్రమలు క్రమంగా తెరుచుకుంటున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభాలను గడించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 38,799కి చేరుకుంది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,466 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.47%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.13%), బజాజ్ ఫైనాన్స్ (2.90%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.85%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.36%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.33%), టెక్ మహీంద్రా (-0.90%), టైటాన్ కంపెనీ (-0.77%), నెస్లే ఇండియా (-0.62%).