Shivraj Singh Chouhan: ఇలాంటి పార్టీని ఎవరూ కాపాడలేరు: కాంగ్రెస్ సంక్షోభంపై శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు

Shivraj Singh Chouhan opines no one can save such a party
  • కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్య
  • సింథియా, నబీ, సిబాల్ ప్రస్తావన తీసుకువచ్చిన మధ్యప్రదేశ్ సీఎం
  • కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందన్న ఉమా భారతి
నాయకత్వ సమస్యతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పార్టీని ఎవరూ గట్టెక్కించలేరని అన్నారు. "సింథియా గారు తన గళం వినిపించినప్పుడు ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. ఇప్పుడు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్ వంటి నేతలు కాంగ్రెస్ కు పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలని డిమాండ్ చేస్తుంటే వాళ్లిద్దరినీ కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి పార్టీని ఎవరూ కాపాడలేరు" అంటూ వ్యాఖ్యానించారు. అటు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి కూడా ఈ అంశంలో స్పందించారు. నెహ్రూ-గాంధీ కుటుంబ రాజకీయ ఆధిపత్యం ముగిసిందని, కాంగ్రెస్ పార్టీ అంతమైపోయిందని పేర్కొన్నారు.
Shivraj Singh Chouhan
Congress
Sonia Gandhi
Rahul Gandhi
Uma Bharathi
Kapil Sibal
Gulam Nabi Azad

More Telugu News