Subramanian Swamy: 'సుశాంత్ మర్డర్' అంటూ ట్వీట్ చేసిన సుబ్రహ్మణ్యస్వామి

Subramanian Swamy terms Sushant murder in his tweet
  • సుశాంత్ మరణంపై సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు
  • సునందా పుష్కర్ గురించి ప్రస్తావన
  • శ్రీదేవి, సుశాంత్ ల విషయంలో అలా జరగలేదని వెల్లడి
జాతీయస్థాయి అంశాలపై తనదైన శైలిలో స్పందించే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి గత కొన్నిరోజులుగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తిగొలుపుతోంది. తన ట్వీట్ లో ఓ చోట 'సుశాంత్ మర్డర్' అంటూ పేర్కొన్నారు. ఆయన ఏమని ట్వీట్ చేశారంటే... "నాడు సునంద పుష్కర్ పోస్టుమార్టం సందర్భంగా ఎయిమ్స్ డాక్టర్లు ఆమె కడుపులో ఏమి గుర్తించారో అదే అసలైన ఆధారంగా నిలిచింది. కానీ శ్రీదేవి, సుశాంత్ విషయంలో అలా జరగలేదు. ఇక సుశాంత్ విషయానికొస్తే... దుబాయ్ కు చెందిన అయాష్ ఖాన్ అనే డ్రగ్ డీలర్ సుశాంత్ హత్య జరిగిన రోజున అతడిని కలిశాడు. ఎందుకు?" అంటూ ప్రశ్నించారు. అయితే, ఆయన తన ట్వీట్ లో 'సుశాంత్ మర్డర్' అని పేర్కొడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Subramanian Swamy
Sushant Singh Rajput
Sunanda Pushkar
Sridevi

More Telugu News