Maharashtra: రాయ్‌గఢ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. శిథిలాల నుంచి 60 మంది వెలికితీత

Rescue Operation Continues in Raigad

  • నిన్న ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
  • ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రులు
  • శిథిలాల కింద మరో 30 మంది

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడి ఐదంతస్తుల భవనం నిన్న ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. నిన్న రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇప్పటి వరకు 60 మందిని రక్షించగా, ఇంకా 30 మంది వరకు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గాయపడిన వారిని ముంబై ఆసుపత్రికి తరలించారు.

భవనం కూలిన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు అదితి తాట్కరే, ఏక్‌నాథ్ షిండేలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇప్పటి వరకు 60 మందిని రక్షించామని, మరో 30 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, కూలిన భవనంలో 45 వరకు కుటుంబాలు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారనేది కచ్చితంగా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News