Ussain Bolt: నాకు కరోనా సోకినట్టు ఇంకా నిర్ధారణ కాలేదు: ఉసేన్ బోల్ట్

Ussain Bolt cofirms that still he is not confirmed with Corona
  • గత శనివారం కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా
  • ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందన్న బోల్డ్
  • మాస్కులు ధరించకపోవడంపై బోల్ట్ పై పలువురు విమర్శలు
ప్రపంచ టాప్ స్ప్రింటర్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కు కరోనా పాజిటివ్ అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై బోల్ట్ స్పందించాడు. తనకు కరోనా సోకినట్టు ఇంకా నిర్ధారణ కాలేదని ఆయన చెప్పాడు. కరోనా రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని తెలిపాడు. గత శనివారం తాను టెస్టులు చేయించుకున్నానని... జమైకా ఆరోగ్యశాఖ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని చెప్పాడు.

ఇటీవలే బోల్ట్ తన 34వ జన్మదినం సందర్భంగా తన స్నేహితులకు భారీ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి పలువురు వీఐపీలు కూడా హాజరయ్యారు. మరోవైపు ఉసేన్ బోల్ట్ పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.
Ussain Bolt
Jamaica
Sprinter
Corona Virus

More Telugu News