Chandrababu: సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచి పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దు: చంద్రబాబు
- టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
- 7 జిల్లాల్లో 70 శాతం కేసులు నమోదయ్యాయని వెల్లడి
- జగన్ నీరో చక్రవర్తిలా తయారయ్యారని విమర్శలు
ఏపీ సర్కారు సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సన్నద్ధమవుతుండడం పట్ల విపక్ష నేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో స్కూళ్లు తెరిచి పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. 7 జిల్లాల్లో 70 శాతం కేసులు నమోదవడం ఏపీలో కరోనా తీవ్రతకు నిదర్శనమని పేర్కొన్నారు. నిత్యం 10 వేల కొత్త కేసులు, 100 మంది చనిపోతున్నా జగన్ లో చలనంలేదని, జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సంక్షోభం వచ్చినప్పుడే పాలకుల సమర్థత బయటపడుతుందని తెలిపారు. టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.