Atchannaidu: అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం
- అచ్చెన్న బెయిల్ పై నేడు విచారణ
- హైకోర్టులో ముగిసిన వాదనలు
- వచ్చే శుక్రవారం తీర్పు వెలువరించనున్న న్యాయస్థానం
ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే శుక్రవారం బెయిల్ పై తీర్పు వెలువరించనుంది.
ఈఎస్ఐ స్కాంలో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేయగా, మరికొందరి గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఏసీబీ అధికారులు వాదించారు. కాగా, కరోనా బారినపడిన అచ్చెన్నాయుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు రమేశ్ ఆసుపత్రి నుంచి ఎన్నారై ఆసుపత్రికి తరలించడం తెలిసిందే.