Building: మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనలో 13కి పెరిగిన మరణాలు... కొనసాగుతున్న సహాయక చర్యలు
- రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఘటన
- తాజాగా మరో ఏడు మృతదేహాలు వెలికితీత
- శిథిలాల నుంచి 60 మందిని కాపాడిన సహాయకబృందాలు
మహారాష్ట్ర రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. తాజాగా మరో ఏడుగురి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. నిన్నటినుంచి కొనసాగుతున్న సహాయకచర్యల్లో ఇప్పటివరకు 60 మందిని కాపాడారు. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక దళ బృందాలు సహాయకచర్యల్లో నిమగ్నమయ్యాయి. కాగా, నిన్న కూలిపోయిన భవనంలో 45 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ భవన సముదాయాన్ని నిర్మించి ఏడేళ్లే అయింది. ఈ భవనం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.