Mothera: వర్షం పడితే కనిపించే అద్భుతం... మోదీ షేర్ చేయగా, మూడు గంటల్లో 6 లక్షల వ్యూస్... వీడియో ఇదిగో

Modi Shared Spectacular Video of Gujarath Sun Temple

  • గుజరాత్ లోని మొతేరాలో సూర్య దేవాలయం
  • 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన అద్భుతం
  • మెట్లపై నుంచి నీరు జాలువారుతున్న దృశ్యాన్ని పోస్ట్ చేసిన మోదీ

తన మనసును తాకిన ఓ సుందర దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా, దానిని చూసిన నెటిజన్లను అందరినీ అది ఆకర్షిస్తూ, ఇప్పుడు వైరల్ అవుతోంది. గుజరాత్ లోని మెహసనా జిల్లా, మోతేరా గ్రామంలో పుష్పావతి నది ఒడ్డున నిర్మించిన ఆలయం ఇది. 11వ శతాబ్దంలో చాళుక్యులు దీన్ని నిర్మించగా, ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయంలో ఇప్పుడు ఎటువంటి పూజలూ చేయడం లేదు. ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత గల కట్టడంగా గుర్తించి, పరిరక్షిస్తోంది.

కాగా, ఇక్కడ వర్షం పడితే ఎంతో అద్భుత దృశ్యం కళ్లముందుంటుంది. వర్షపు నీరు దేవాలయం మెట్లపై నుంచి జాలువారుతున్న దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఇదే విషయాన్ని వెల్లడించిన మోదీ, మొతేరా సూర్య దేవాలయం సౌందర్యాన్ని చూడాలని కోరుతూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఉదయం 7.45 గంటల సమయంలో మోదీ ఈ వీడియోను షేర్ చేయగా, ఇప్పుడు దీన్ని ఎంతో మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News